Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeNationalVivo v60 lite 4g | 90w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వివో కొత్త ఫోన్

Vivo v60 lite 4g | 90w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వివో కొత్త ఫోన్

-

Chat on WhatsApp

vivo v60 lite 4g: వివో తన కొత్త రిఫ్రెష్ మోడల్‌గా “vivo v60 lite 4g” స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన వెర్షన్‌కు ఇది అప్‌డేట్ మోడల్. ముఖ్యంగా పాత “snapdragon 685” స్థానంలో ఇప్పుడు కొత్త “snapdragon 6s gen 2 4g” చిప్‌సెట్‌ను అందించారు. మిగతా స్పెసిఫికేషన్లు దాదాపు అదే విధంగా కొనసాగాయి. ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు.

ఈ ఫోన్ 6.77 అంగుళాల full hd+ amoled డిస్‌ప్లేతో వస్తుంది. 120hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉంది. 8gb lpddr4x ram, 256gb ufs 2.2 స్టోరేజ్ అందించారు. అవసరమైతే 8gb వరకు వర్చువల్ ram విస్తరించుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే 50mp ప్రైమరీ కెమెరా, 8mp అల్ట్రా వైడ్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32mp సెల్ఫీ కెమెరా అందించారు. 6,500mah బ్యాటరీతో పాటు 90w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

android 15 ఆధారిత funtouch os 15 పై రన్ అవుతుంది. in-display fingerprint సెన్సార్, 4g, wi-fi, bluetooth, usb type-c వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp