Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeInterNationalAI Impact Summit 2026 | AIతో ఉద్యోగాలకు ముప్పులేదు

AI Impact Summit 2026 | AIతో ఉద్యోగాలకు ముప్పులేదు

-

Chat on WhatsApp

AI Impact Summit 2026: న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో ప్రారంభమైన “AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026” లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ (AI) ఉద్యోగాలను తీసేస్తుందన్న చర్చలో నిజం లేదని, ఉద్యోగాలు నిలిచిపోతాయని, పనితీరు మరింత పెరుగుతుందని తెలిపారు.

రాబోయే మూడు సంవత్సరాల్లో AI రంగం విపరీతంగా విస్తరిస్తుందని, యువత ఈ టెక్నాలజీని అలవాటు చేసుకోకపోతే వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సదస్సులో మాట్లాడిన “మైక్రోసాఫ్ట్ ఇండియా-సౌత్ ఆసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్” మాట్లాడుతూ, AI మోడళ్లు అతి వేగంతో అభివృద్ధి చెందుతున్నాయని, AI ఉద్యోగాలను చంపదు, రూపాన్ని మాత్రమే మార్చుతుంది అని స్పష్టం చేశారు. “ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్చందా” కూడా, AI వాడకంతో ఉద్యోగాలను తొలగించడం కాదు, అయితే తక్కువ ఆదాయ మార్కెట్లకూ సేవలను అందించడంలో సహాయపడుతోందని అన్నారు.

చాట్‌బాట్లు, వాయిస్ బాట్ల సహాయంతో ఉత్పాదకత, పనితీరు పెరుగుతున్నట్లు తెలిపారు. AI నేర్చుకున్నవారికి భవిష్యత్తులో విపరీత అవకాశాలు ఉండనున్నాయని, ఆర్థిక వృద్ధి, సామాజిక మేలు కోసం AI కీలకం అవుతున్నదని పారిశ్రామికవేత్తలు వివరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

cobra blocks traffic on palace road in bengaluru viral video

Cobra Blocks Traffic | బెంగళూరు ట్రాఫిక్‌ను ఆపగలిగింది చివరకు ఒక కోబ్రానే..!

బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు సాధారణమే. అయితే ఈసారి ట్రాఫిక్‌కు కారణమైనది వాహనాల రద్దీ కాదు.. ఓ భారీ తాచుపాము. నగరంలోని ప్యాలెస్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి వాహనదారులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా...
- Advertisement -
Chat on WhatsApp