Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadGHMC Three Municipal Corporations | హైదరాబాద్ మూడు కార్పొరేషన్లు – మీ ఏరియా ఎక్కడ...

GHMC Three Municipal Corporations | హైదరాబాద్ మూడు కార్పొరేషన్లు – మీ ఏరియా ఎక్కడ ఉందో తెలుసా?

-

Chat on WhatsApp

GHMC Three Municipal Corporations: హైదరాబాద్‌ నగర పాలనలో తెలంగాణ ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC)ను మూడు స్వతంత్ర మున్సిపల్‌ కార్పొరేషన్లుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

నగరం వేగంగా విస్తరిస్తుండటంతో పరిపాలన మరింత సమర్థంగా సాగాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 1955 జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారమే ఈ కొత్త వ్యవస్థను అమలు చేస్తున్నారు.

కొత్తగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MMC)లను ఏర్పాటు చేశారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ కొనసాగుతుండగా, సైబరాబాద్‌ కమిషనర్‌గా జి. శ్రీజన, మల్కాజ్‌గిరి కమిషనర్‌గా టి. వినయ్‌కృష్ణారెడ్డిని నియమించారు. మూడు కార్పొరేషన్ల విభజన ప్రక్రియను ప్రత్యేక అధికారి శ్రీ రంజన్ పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం అన్ని పరిపాలనా పనులు GHMC ప్రధాన కార్యాలయం నుంచే కొనసాగుతాయి.

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు చేరాయి. మల్కాజ్‌గిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ జోన్లతో మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పడింది. మిగిలిన శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, గోల్కొండ‌, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్ జోన్లు ప్రస్తుత GHMC పరిధిలోనే కొనసాగనున్నాయి.

ఈ మార్పులతో నగర పాలన మరింత వేగవంతంగా, ప్రజలకు చేరువగా మారనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp