Monday, August 3, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadMunicipal Elections | ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Municipal Elections | ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

-

Chat on WhatsApp


Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సీఎం ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న సీఎం, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

ఓటు వేసిన అనంతరం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణమయ్యారు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

ఇక మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కావాలని ప్రజలకు ఆయన సూచించారు.

అలాగే మంచిర్యాల హైటెక్ సిటీలోని 227వ నంబర్ పోలింగ్ బూత్‌లో మంత్రి వివేక్ ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొనడంతో ఎన్నికలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రజల భాగస్వామ్యంతో మున్సిపల్ ఎన్నికలు విజయవంతంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Nara Lokesh Supports PM Modi's Nasha Mukt Yuva Campaign Against Drugs

Nara Lokesh | డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం.. ప్రధాని కార్యక్రమానికి లోకేశ్ పూర్తి...

Nara Lokesh: మత్తు పదార్థాల నిర్మూలనకు దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘నషా ముక్త్ యువ(Nasha Mukt Yuva) ఫర్ వికసిత్ భారత్(Viksit Bharat) సంకల్ప్ అభియాన్’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి...
- Advertisement -
Chat on WhatsApp