Tuesday, July 28, 2026
Chat on WhatsApp
HomeManipurరాష్ట్రపతి పాలన రద్దు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం

రాష్ట్రపతి పాలన రద్దు.. కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం

-

Chat on WhatsApp

Manipur political news: కేంద్ర హోం శాఖ మణిపూర్‌లో సుదీర్ఘకాలంగా అమలులో ఉన్న రాష్ట్రపతి పాలన (President’s Rule)ను రద్దు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్రమంగా మెరుగవుతూ, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి ఇది కీలక నిర్ణయం.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ఆమోదంతో, ఆర్టికల్ 356 కింద విధించిన పాలనను తక్షణమే ఉపసంహరించడం కేంద్రం ప్రకటించింది.

గతేడాది ఫిబ్రవరిలో బీరేన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. బీజేపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత, మాజీ స్పీకర్, సీనియర్ నేత యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ మణిపూర్ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యారు.

రాష్ట్రపతి పాలన ఎత్తివేతతో మణిపూర్‌లో రాజకీయ సమీకరణాలు వేగవంతమవుతున్నాయి. గతంలోని జాతుల మధ్య ఘర్షణలు, అశాంతి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కేంద్రం పాలన తీసుకుంది.

ఇప్పుడు నియమిత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరంగా విధులు ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఈ నిర్ణయం మణిపూర్ ప్రజలకు ఊరట కలిగిస్తూ, రాష్ట్ర రాజకీయాలను నూతన దిశలో తీసుకువెళ్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Telangana Chief Minister Revanth Reddy speaking about HYDRA

Revanth Reddy | కబ్జాకోరులకు సీఎం వార్నింగ్.. హైడ్రా విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదు

Revanth Reddy: హైడ్రా(HYDRA) వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన ప్రధాన సంస్కరణల్లో హైడ్రా ఒకటని పేర్కొంటూ,...
- Advertisement -
Chat on WhatsApp