Monday, February 23, 2026
No menu items!
spot_img
HomeInterNationalDonald Trump | ఆమె అందంగా ఉంది...భర్తకి పదవి ఇచ్చా: ట్రంప్ వ్యాఖ్యలు వైరల్

Donald Trump | ఆమె అందంగా ఉంది…భర్తకి పదవి ఇచ్చా: ట్రంప్ వ్యాఖ్యలు వైరల్

Trump on Doug Burgum wife: ఇంటర్నేషనల్ నిత్యం  వార్తల్లో  నిలిచేది ఎవరైనా ఉన్నారు అంటే అది డోనాల్డ్ ట్రంప్ అనే చెప్పాలి ఎందుకంటే. అమెరికా అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్” అమెరికా ఇంటీరియర్‌ సెక్రటరీగా “డగ్ బర్గమ్” ను నియమించారు. ఈ నియామకంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్రంప్ వెల్లడించిన వివరాల ప్రకారం, బర్గమ్ భార్య “క్యాథరిన్ బర్గమ్” చాలా అందంగా ఉన్నందున ఆయనకు పదవి ఇచ్చారని చెప్పడంతో గుండెద్రవికంగా వార్తలలో నిలిచింది. ఈ వ్యాఖ్యలు బయటపడ్డప్పుడు బర్గమ్ మరియు ఆయన భార్య అక్కడే ఉన్నారు.

మునుపటి మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత ఓవల్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ చెప్పారు: “బర్గమ్ మరియు భార్య గుర్రపు స్వారీ వీడియోను చూశాను. ఆమె ఆకర్షణీయంగా కనిపించింది. నా సిబ్బందిని అడిగి వారి వివరాలు తెలుసుకున్న తర్వాత నా అభిప్రాయం ఏర్పడింది.

ఇదే కారణంగా బర్గమ్‌కు పదవి ఇచ్చాను. బర్గమ్ విజయవంతమైన బిజినెస్ మ్యాన్, నార్త్ డకోటాకు రెండుసార్లు గవర్నర్‌గా పని చేశారు. అయినప్పటికీ, ఆయన విజయానికి భార్య పాత్ర కీలకం.”

ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలను కించపరిచేలా ఆయన మాటలు ఉన్నాయని పలువురు ఆరోపించారు. ట్రంప్ గతంలోనూ మహిళలపై వివాదాస్పద పదజాలం ఉపయోగించిన సంగతి తెలిసిందే.

also read:T20 World Cup 2026 | బంగ్లాదేశ్ భారత్‌కు రాకపోవడం వారి స్వయంచాలిత తప్పిదం: సురేశ్ రైనా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular