Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalSecret Sonic Weapon: వెనెజువెలా దాడిలో ఎవరికీ తెలియని ఆయుధం వాడాం: ట్రంప్ 

Secret Sonic Weapon: వెనెజువెలా దాడిలో ఎవరికీ తెలియని ఆయుధం వాడాం: ట్రంప్ 

-

Chat on WhatsApp

Donald Trump: వెనెజువెలాపై నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అమెరికా అత్యంత శక్తిమంతమైన ‘రహస్య ఆయుధం’ను వినియోగించినట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను నిర్బంధించేందుకు చేపట్టిన మెరుపుదాడిలో సీక్రెట్ సోనిక్ వెపన్‌ను ఉపయోగించామని ట్రంప్ వెల్లడించారు.

ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ట్రంప్, “మన వద్ద ఎవరికీ తెలియని ఆయుధాలు ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది.

అది అద్భుతమైన ఆపరేషన్” అని వ్యాఖ్యానించారు. తమ వద్ద ఉన్న ఈ సాంకేతికత మరే దేశం వద్ద లేదన్న అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.

మదురోను కస్టడీలోకి తీసుకునేందుకు నిర్వహించిన ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’ సమయంలో ఈ ఆయుధాన్ని ఉపయోగించినట్లు, ట్రంప్‌కు సన్నిహితంగా పనిచేసిన ఓ మాజీ గార్డ్ వెల్లడించిన వ్యాఖ్యలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

“మా ముక్కుల నుంచి రక్తం కారింది. కొందరు వాంతులు చేసుకున్నారు. మరికొందరు నేలపై పడిపోయారు. ఆ సోనిక్ ఆయుధం ముందు మేం నిలబడలేకపోయాం” అని అతడు తెలిపాడు.

ఈ వ్యాఖ్యలను ఓ మీడియా సంస్థ ప్రచురించగా, వాటిని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో అమెరికా వినియోగించిన సీక్రెట్ సోనిక్ వెపన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp