US Politics: బహిరంగ సభలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తన వ్యాఖ్యలతో వివాదానికి కేంద్రంగా నిలిచారు. నార్త్ కరోలినాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్, రాజకీయ అంశాలకంటే వ్యక్తిగత విషయాలను మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ర్యాలీలో అనూహ్య వ్యాఖ్యలు
ప్రసంగం సందర్భంగా ట్రంప్ తన భార్య మెలానియా ట్రంప్ లోదుస్తుల గురించి మాట్లాడటం అక్కడున్న జనాన్ని షాక్‌కు గురిచేసింది. 2022లో తన ఫ్లోరిడా నివాసంపై జరిగిన FBI సోదాల గురించి ప్రస్తావిస్తూ, ఫెడరల్ ఏజెంట్లు మెలానియా గదిలోకి వెళ్లి ఆమె వార్డ్‌రోబ్‌ను చిందరవందర చేశారని ఆరోపించారు. మెలానియా ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తి అని, ఆమె ప్రతిదీ పరిపూర్ణంగా ఉంచుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
FBI సోదాలపై ఆరోపణలు
మార్-ఎ-లాగో నివాసంలో FBI సోదాలను రాజకీయ ప్రేరేపితమని ట్రంప్ మరోసారి విమర్శించారు. తన పదవీకాలం ముగిసిన తర్వాత అధికారిక పత్రాలను తీసుకెళ్లిన వ్యవహారంపై తనపై అన్యాయంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఎన్నికల హామీలు
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్యాస్ ధరలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గిస్తామని ట్రంప్ హామీ ఇచ్చారు. దేశంలోని ఆర్థిక సమస్యలకు బైడెన్ పాలనే కారణమని ఆరోపించారు. నార్త్ కరోలినాలో ఉద్యోగాల సృష్టి తమ పాలనలో వేగంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.
also read:2023 వరల్డ్ కప్ తరువాత మానసిక ఒత్తిడికి గురయ్యాను….రోహిత్ సంచలన వ్యాఖ్యలు
