Wednesday, March 11, 2026
No menu items!
Home Andhra Pradesh Bapatla Police Warning | తప్పుడు మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు 

Bapatla Police Warning | తప్పుడు మెసేజ్‌లు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు 

0
10
Bapatla police issue warning against forwarding fake AI-generated messages
Bapatla police issue warning against forwarding fake AI-generated messages

Bapatla police warn citizens: బాపట్ల జిల్లాలో పాకిస్థాన్ జెండాతో ఉన్న కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కొంతమంది యువకులు AI టూల్స్‌ను(AI TOOLS) వినియోగించి సరదాగా రూపొందించిన ఈ ఇమేజ్‌లు వ్యక్తిగతంగా ఫార్వర్డ్ చేయబడ్డాయి.

అయితే కొంతమంది కావాలనే వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో విషయం వేగంగా వైరల్ అయ్యింది.

ALSO READ:ఏపీ మంత్రి పీఏపై వేధింపుల ఆరోపణలు–తక్షణమే తొలగించాలని సీఎంవో ఆదేశం

ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. సోషల్ మీడియా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని పంచే వేదికగా ఉండాలని, తప్పుడు లేదా నిర్ధారించని సందేశాలను ఫార్వర్డ్ చేయడం వల్ల అసత్య ప్రచారం జరుగుతోందని స్పష్టం చేశారు.

ఇలాంటి పోస్టులు ప్రజల్లో అపోహలు, అసౌకర్యాలు సృష్టించే ప్రమాదం ఉందని పోలీసులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఏ సమాచారమైనా పంచే ముందు వాస్తవాలు నిర్థారించుకోవాలని, చట్టవ్యతిరేకమైన ఫోటోలు లేదా మెసేజ్‌లు షేర్ చేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

సోషల్ మీడియా ఉపయోగంలో జాగ్రత్తలు పాటించడం ప్రతి వాడుకరి బాధ్యత అని పోలీసులు గుర్తుచేశారు.

YouTube thumbnailYouTube icon