Lakshmi Mittal UK exit: ఉక్కు పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానాన్ని సంపాదించిన బిలియనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్(Lakshmi Nivas Mittal) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బ్రిటన్‌కు వీడ్కోలు పలికారు. 1995 నుంచి లండన్‌లో నివసిస్తున్న మిట్టల్ ఇటీవల తన నివాసాన్ని స్విట్జర్లాండ్‌కు మార్చడం పెద్ద చర్చకు దారితీసింది.
యూకే(UK) ప్రభుత్వం వారసత్వ పన్ను విధానంలో చేయబోతున్న మార్పులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025’ ప్రకారం మిట్టల్ సంపద విలువ 15.4 బిలియన్ పౌండ్లు. ఈ స్థాయితో ఆయన బ్రిటన్‌లో 8వ అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
స్విట్జర్లాండ్‌కు మారిన ఆయన, భవిష్యత్తులో దుబాయ్‌లో స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు యూరప్, అమెరికా, దుబాయ్‌లో విస్తారమైన ఆస్తులు ఉన్నాయి.
ALSO READ:H-1B visa policy | హెచ్-1బీ వీసాలపై ట్రంప్ వైఖరిని సమర్థించిన వైట్‌హౌస్
రాజస్థాన్‌లో జన్మించిన మిట్టల్, ఆర్సెలర్ మిట్టల్ ద్వారా ప్రపంచ ఉక్కు రంగంలో అతిపెద్ద ప్రభావం చూపించారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండో అతిపెద్ద స్టీల్ ప్రొడ్యూసర్‌గా ఈ సంస్థ కొనసాగుతోంది. కంపెనీలో మిట్టల్ కుటుంబం సుమారు 40 శాతం వాటాను కలిగి ఉంది. 2021లో ఆయన సీఈఓ పదవి నుంచి తప్పుకోగా, కుమారుడు ఆదిత్య మిట్టల్ ఆ బాధ్యతలను స్వీకరించారు.
మూడు దశాబ్దాల పాటు బ్రిటన్‌లో నివసించిన ఆయన, పన్నుల విధాన మార్పుల కారణంగా దేశం విడిచి వెళ్లడం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
