Anchor Shivajyothi Tirumala Controversy:ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇటీవల ఆమె తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమలకు వెళ్లిన శివజ్యోతి స్నేహితుడు “ఇక్కడ కాస్ట్లీ ప్రసాదం” అడుక్కుంటున్నాం “రిచ్చెస్ట్ బిచ్చగాళ్లం మేమే” అని వ్యాఖ్యానించగా, ఆమె నవ్వుతూ సమ్మతించినట్లుగా వీడియోలో కనిపించింది.
ఈ వీడియో బయటకు రావడంతో భక్తులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా మాట్లాడడం అపమానం అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన ప్రజా వేదికలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసమంజసం అని సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం వీడియో వైరల్ అవుతుండగా, శివజ్యోతి స్పందన ఎప్పుడొస్తుందో వేచిచూస్తున్నారు.
ALSO READ:కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త త్వరలో ప్రారంభం కానున్న రైల్వే స్టేషన్
