Annadata Sukhibhava:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని జొన్నగురకల గ్రామంలో ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. రైతుల మొఖంలో ఆనందానికి అవధులు లేవు. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కావడంతో గ్రామం అంతా సంబరాలతో మార్మోగింది.
రైతులు సచివాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ALSO READ:Rahul Gandhi EC Allegations | రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రముఖుల లేఖ
మొత్తం ₹20,000 పంట సాయం హామీలో భాగంగా ఈ విడతలో రాష్ట్రం మరియు కేంద్రం కలిసి నిధులు జమ చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మందికి పైగా రైతులకు ఆర్థిక భరోసా అందింది. మిఠాయిలు పంచుకుంటూ రైతులు ఈ ప్రభుత్వం నిజమైన రైతు ప్రభుత్వం అనిపించిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రామరాజు, సచివాలయ సిబ్బంది, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి మధు కుమార్, బీసీ సెల్ రామచంద్ర, మైనార్టీ సెల్ షబ్బీర్, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి జైపాల్ రైతులు పాల్గొన్నారు.
