Cold Wave in Telangana:తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత అకస్మాత్తుగా పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డిసెంబర్ రాకముందే ఇంతగా చలి పెట్టడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ వంటి ఉత్తర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది.
డిసెంబర్ ఇంకా రాకముందే చలి పెరగడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. పగటిపూట కూడా చల్లని గాలులు వీచడంతో సాధారణ జీవితానికి అంతరాయం ఏర్పడింది.
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ దిశ నుంచి వచ్చే చల్లని గాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయి. వివిధ ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులు సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. దుప్పట్లు, రగ్గులు లేకపోవడం, వేడి నీటి సదుపాయం అందుబాటులో లేకపోవడం విద్యార్థులను కష్టాల్లోకి నెడుతోంది.
ALSO READ:SS Rajamouli Controversy: రాష్ట్రీయ వానరసేన కంప్లయింట్
చలి ప్రభావం రైతులపై కూడా కనిపిస్తోంది. యాసంగి పంట నారు ఎదుగుదల మందగించడం, మంచుతో పత్తి మరియు కూరగాయల పంటలు దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వృద్ధులు, చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు వంటి వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తీవ్రమైన చలిలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అవసరమైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
