తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) పోటీ చేసే అభ్యర్థులపై ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన రద్దైంది.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చింది.
ఇప్పటి వరకూ ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు సర్పంచ్(Sarpanch), వార్డ్ మెంబర్, ఎంపీటీసీ(ZPTC), జడ్పీటీసీ( MPTC) వంటి స్థానిక సంస్థల పదవులకు పోటీ చేయలేకపోయారు.
also read:TTD February Tokens Release: శ్రీవారి దర్శనానికి కోటా తేదీలు ప్రకటించిన టీటీడీ
ఈ నిబంధన తొలగింపుతో, ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వారికీ పోటీ చేసే అవకాశం లభించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హతలను సమానంగా చేసేందుకు, ప్రజా ప్రతినిధులుగా వ్యవహరించేందుకు మరింత మందికి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పు కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
