HomeTelanganaTelangana New Governor | తెలంగాణ నూతన గవర్నర్‌కు ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్...

Telangana New Governor | తెలంగాణ నూతన గవర్నర్‌కు ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి

-

Chat on WhatsApp

Telangana New Governor: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) కు రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్వాగతం పలికారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన హైదరాబాద్‌కు రావడంతో అధికార వర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

విమానాశ్రయంలో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, నూతన గవర్నర్‌కు రాష్ట్రంలోని ముఖ్యాధికారులను పరిచయం చేశారు.

telangana governor shiv pratap shukla



తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో గవర్నర్ పాత్ర కీలకమైందని, కొత్త బాధ్యతలను స్వీకరించనున్న శివ ప్రతాప్ శుక్లాకు ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో రాజ్ భవన్ సహకారం కీలకంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

నూతన గవర్నర్ రాకతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. త్వరలోనే ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp