ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం ములు కొత్త గా పైలెట్ ప్రాజెక్టుగా అంగన్వాడి కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల ప్రీ స్కూల్ పిల్లలకు ప్రతి రోజు 100 మి.లీ. పాల పంపిణీ(Anganwadi Milk Scheme)కార్యక్రమాని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పి.ఓ. చిత్రం మిశ్రా, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి.హెచ్. మహేందర్ జి., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రీ స్కూల్ పిల్లల పోషణ, ఆరోగ్యాభివృద్ధి, పాల వినియోగం పెంచడం వంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని అమలులోకి తెచ్చారు. కార్యక్రమంలో డబ్ల్యూ.ఓ. తుల రవి, సీడీపీ ఓ శిరీష, అంగన్వాడి టీచర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
