Thursday, March 19, 2026
No menu items!
spot_img
HomeFilms Newsమంచు విష్ణు 'కన్నప్ప'కి కొత్త విడుదల తేదీ లాక్!

మంచు విష్ణు ‘కన్నప్ప’కి కొత్త విడుదల తేదీ లాక్!

-

మంచు విష్ణు నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ కొత్త విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమాను వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా జూన్ 27న విడుదల కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు, హీరో మంచు విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా హాజరయ్యారు. సీఎం యోగి సినిమా టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్‌ దృశ్యాలు, కథాకథనాలు సినిమాపై మరింత అంచనాలను పెంచుతున్నాయి. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు శివ భక్తుడిగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో విష్ణుకు జోడీగా ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అలాగే మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisment -

Must Read

stock market crash graph showing sharp fall in sensex and nifty indices

Stock market crash | స్టాక్ మార్కెట్ బ్లడ్ బాత్: నిఫ్టి, సెన్సెక్స్ భారీ...

Stock market crash: ఉగాది పర్వదినం సందర్భంగా లాభాల ఆశతో ఉన్న ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ భారీ షాక్ ఇచ్చింది. నిఫ్టి, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టి సూచీలు తీవ్రంగా పతనమై మార్కెట్‌లో ‘బ్లడ్...