Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం తునిలో నిర్వహణ

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం తునిలో నిర్వహణ

-

Chat on WhatsApp

కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం మదర్ క్యాంపస్ ఆవరణలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోటనందూరు ఎస్‌ఐ టి. రామకృష్ణ హాజరై రోడ్డు భద్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని వివరించారు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనం నడపడం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. పాదచారులు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మదర్ కాలేజీ కరస్పాండెంట్ పెనుముచ్చు నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ కేవి రాజు, హెచ్ఎం కే. నాగేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు అందించారు.

కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులు రోడ్డు భద్రత ప్రమాణాలపై ప్రమాణం చేశారు. అవగాహనతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతను పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, యువత ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp