అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన నిండుగొండ వెంకన్న ఇంటి అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ బాధిత కుటుంబానికి అండగా నిలిచింది.
మంగళవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రోత్సాహం కల్పించేందుకు జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా రాజాన వీర సూర్యచంద్ర మాట్లాడుతూ, ఇల్లు కాలి నిరాశ్రయులైన కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. హౌసింగ్ పథకం కింద ఇల్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం కాలిపోయిన ఇంటిని పరిశీలించిన సూర్యచంద్ర, బాధిత కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు వెలగల వెంకటరమణ, నాయకులు మాకిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.