Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadచర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్దం

చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్దం

-

Chat on WhatsApp

పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌కు సమీపంలోని చర్లపల్లి వద్ద నిర్మించిన భారీ రైల్వే టెర్మినల్ ఈ నెల 28న ప్రారంభం కానుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ టెర్మినల్‌ను ప్రారంభించనున్నారు.

అత్యాధునికంగా నిర్మించిన ఈ టెర్మినల్ కోసం రూ.430 కోట్ల వ్యయం జరిగింది. ఇందులో 9 ప్లాట్‌ఫాంలు, 6 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రిజర్వేషన్ కౌంటర్లు, రెగ్యులర్ టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, ఏసీ, నాన్-ఏసీ వెయిటింగ్ లాంజ్‌లు, ఉచిత వై-ఫై సదుపాయం అందుబాటులో ఉన్నాయి.

చర్లపల్లి టెర్మినల్ నుంచి రోజుకి 25 రైళ్లు (25 అప్, 25 డౌన్) రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఈ టెర్మినల్‌ను నిర్మించారు. ప్రతి రోజు దాదాపు 50 వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్‌ను ఉపయోగిస్తారని అంచనా.

ఈ స్టేషన్ నిర్మాణం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ శైలిలో ఉండటంతో, ఇది నూతన సౌకర్యాలకు నిలయంగా నిలుస్తుంది. ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి అన్ని విధాలా సమీకృత సేవలు అందుబాటులో ఉంటాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp