ఆత్మహత్యల నివారణ నేపథ్యంలో బాసర గోదావరి బ్రిడ్జ్ ను పోలీస్ అధికారులతో సందర్శించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఈ క్రమంలో బ్రిడ్జిపై అవసరమైన చర్యలను ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, బాసర బ్రిడ్జిపై ఎలాంటి ఆత్మహత్యలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇరువైపులా సుమారు 6 ఫీట్ల జాలిలు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని బాసర పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేయాలని తెలిపారు.
అలాగే, ఇక్కడ ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుల్‌లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు నియమించేందుకు బ్లూ కోర్ట్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.
బాసర బ్రిడ్జి నిజామాబాద్ పరిధిలో భాగంగా ఉండడంతో, నిజామాబాద్ సీపీతో సంభాషణ చేసి, సమన్వయంతో ఈ కార్యక్రమం కొనసాగించాలని, నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం పునరావృత ఆత్మహత్యలను నిరోధించేలా కట్టుబడి ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.
