టాలీవుడ్‌లో తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ప్రముఖ కమెడియన్ “30 ఇయర్స్ ఇండస్ట్రీ” పృథ్వీ తాజాగా సోషల్ మీడియా వేదిక ఎక్స్ (మాజీ ట్విట్టర్)లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన తొలి ట్వీట్ ద్వారా వెల్లడించారు. అభిమానులు, సినీ ప్రియులతో మరింత దగ్గరగా ఉండేందుకు ఈ వేదికను ఉపయోగించుకోనున్నట్లు పేర్కొన్నారు.
తన తొలి ట్వీట్‌లో పృథ్వీ, “హాయ్… నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని. అఫిషియల్‌గా ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్)లోకి వచ్చేశాను. నేను నా భావాలను స్టేజ్‌పై ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఈ రోజు నుంచి ఈ ఎక్స్ వేదికను ఉపయోగించి నా భావ ప్రకటన స్వేచ్ఛను తెలియపరుస్తాను… థాంక్యూ” అని తెలిపారు. ఈ ట్వీట్‌తో ఆయన అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
పృథ్వీ గతంలో తన కామెడీ డైలాగ్‌లతో పాటు రాజకీయ వ్యాఖ్యల కారణంగా కూడా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలు, తనదైన హాస్యశైలితో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత తన అభిప్రాయాలను మరింత బహిరంగంగా పంచుకోనుండటంతో, ఆయన పోస్టులు విస్తృత చర్చకు దారితీయనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో ప్రవేశం సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన ట్వీట్లు, విశేషాలను పంచుకునే అవకాశముందని భావిస్తున్నారు. సోషల్ మీడియాలోకి వచ్చిన పృథ్వీ భవిష్యత్తులో ఎలాంటి పోస్ట్‌లు చేయనున్నారో చూడాలి!