• Home
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • InterNational
  • ENTERTAINMENT
  • Technology News
  • Others
    • Politics News
    • Crime News
    • Health News
    • Business
Search
Logo
Thursday, August 6, 2026
Facebook
Instagram
Twitter
Vimeo
Youtube
Logo
Chat on WhatsApp
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • InterNational
  • ENTERTAINMENT
  • Technology News
  • Others
    • Politics News
    • Crime News
    • Health News
    • Business

Monthly Archives: June 2025

G.BALAKRISHNA-A1-HYD-062-SANATH NAGAR-REPORTER-8885553376

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఆలోచనలు, భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ తాత్వికమైన సందేశం నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. "క్రీడల ముసుగులో ఇతరుల్ని బాధపెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు?" అంటూ రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నించారు. ఈ వాక్యం సామాన్యంగా ఉన్నా, దానికున్న లోతైన అర్థాన్ని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. జంతు ప్రేమికురాలిగా పేరొందిన రేణు, మూగజీవాల సంరక్షణ, హక్కుల కోసం ఆమె పెట్టే పోస్టులు తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం చేసిన ఈ కామెంట్ కూడా అదే తరహాలో ఉందని పలువురు భావిస్తున్నారు. వినోదం, ఆటల పేరుతో జంతువులపై హింసను కండించేందుకు ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూ తన అభిమానం చూపే వారు ఈ పోస్టును మెచ్చుకుంటున్నారు. మానవత్వం, జాలితో కూడిన ఆమె యొక్క పోస్ట్‌లు పలువురికి ఆలోచనలకు దారి తీస్తున్నాయి. తన అభిప్రాయాలను నెమ్మదిగా, కానీ బలంగా వ్యక్తపరిచే రేణు దేశాయ్... మరోసారి తన తాత్వికతతో సోషల్ మీడియాలో చర్చకు కేంద్ర బిందువైయ్యారు.

”రేణు దేశాయ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్”

తండ్రి ప్రేమ ఎంత గొప్పదో మళ్లీ ఒక్కసారి ప్రపంచానికి తెలియజెప్పిన ఘ‌ట‌న ఇది. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఫోర్ట్ లాడర్‌డేల్ బీచ్‌లో ఓ తండ్రి తన పిల్లలను కాపాడేందుకు సముద్రంలో దూకాడు. ఇద్దరు చిన్నారులను రక్షించాడు. కానీ తాను మాత్రం తిరిగి బయటకు రాలేదు. 33 ఏళ్ల ఆంట్వోన్ విల్సన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సముద్ర తీరానికి వెళ్లాడు. అక్కడ అచ్ఛానుకోకుండా ఇద్దరు చిన్నారులు నీటిలో కొట్టుకుపోతుండగా తండ్రిగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకాడు. గట్టి ప్రయత్నంతో తన ఇద్దరు పిల్లలను కాపాడిన విల్సన్ తన శరీర శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో నీటిలోనే చనిపోయాడు. ఘటనను చూసిన వారు హృదయ విఘాతంగా అభివర్ణిస్తున్నారు. తండ్రి ధైర్యం, త్యాగం అమెరికా మొత్తం కదిలించేసింది. సోషల్ మీడియాలో వేలాది మంది ఈ ఘటనపై స్పందిస్తూ విల్సన్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. తండ్రి ప్రేమకు ఇది పరాకాష్ఠ. పిల్లల కోసం ప్రాణాలూ ఇవ్వగలిగిన ఆదర్శ తండ్రిగా ఆంట్వోన్ విల్సన్ పేరు ఎన్నటికీ గుర్తుండిపోతుంది.

పిల్లల్ని కాపాడిన తండ్రి.. తాను సముద్రంలో విలీనం – ఫ్లోరిడాలో హృదయవిదారక ఘటన

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్‌లో పరిస్థితి రోజురోజుకూ మరింత గందరగోళంగా మారుతోంది. ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్ ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు. రాజధాని తెహ్రాన్‌ లోని రహదారులు జనాలతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా కాస్పియన్ సముద్రం వైపు వెళ్లే హైవేలు కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నాయి. ఇంధన కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఓవర్‌లోడ్ అయ్యే అవకాశం ఉండడంతో ఏటీఎంలపై కూడా ఆంక్షలు విధించారు. నగదు కోసం ప్రజలు క్యూలలో నిలబడాల్సి వస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మౌనం ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తతకు దారితీస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు భద్రత కోసం నగరాలను వదిలి గ్రామాల వైపు, లేదా పక్కటి దేశాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరోవైపు ఈ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ మార్కెట్లపై కూడా పడే అవకాశం ఉన్నందున అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

“ఇజ్రాయెల్ దాడుల భయంతో ఇరాన్‌లో గందరగోళం – ఇంధన కొరత, ట్రాఫిక్ జామ్, ప్రజల...

తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతోంది. కేటీఆర్ పై కేసులు పెట్టడాన్ని టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి హరీశ్ రావు, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ తలవంచడని మీకు చెబుతున్నా. ఇది కక్షసాధింపు రాజకీయాలే. ప్రజల్లో ఆదరణ లేకపోయిన రేవంత్ రెడ్డి, ఈ మాయా నాటకాలతో పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ Telangana మొత్తం కేటీఆర్ వెనుక ఉందని, ప్రజలు బలంగా ఆయనకు మద్దతుగా ఉన్నారని స్పష్టం చేశారు. ఒక్కవైపు కేసులు, మరోవైపు విమర్శలు కానీ టీఆర్‌ఎస్ నేతలు మాత్రం కేటీఆర్ కు మద్దతుగా గళమెత్తుతున్నారు. ఈ రాజకీయ దుమారంలో ఎవరి మాట నమ్మాలి అనేది మాత్రం ప్రజల తీర్పు తేల్చాలి.

“కేటీఆర్ పై కేసులు వేసినా తలవంచడు – రేవంత్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు: హరీశ్ రావు”

N RAMESH – SRI SATHYA SAI – Hindupur – A1-SSS-157...

M BAVAJAN – CO-ORDINATOR – A1-HYD-1011 – HYDERABAD – 8555962234

123...13Page 1 of 13

EDITOR PICKS

Ishan Kishan | క్రికెట్, ప్రభుత్వ ఉద్యోగం రెండూ కలిసి.. ఇషాన్ కిషన్ డబుల్ రోల్!

Nara Lokesh | ‘మా కేబినెట్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ పవన్ అన్నే’.. లోకేశ్ వ్యాఖ్యలు వైరల్

Mark Zuckerberg | డీప్‌ఫేక్‌లు, కంటెంట్ లోపాలపై మెటా క్షమాపణ!.. కేంద్ర హెచ్చరికతో దిగొచ్చిన జుకర్‌బర్గ్

POPULAR POSTS

G.BALAKRISHNA-A1-HYD-062-SANATH NAGAR-REPORTER-8885553376

”రేణు దేశాయ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్”

పిల్లల్ని కాపాడిన తండ్రి.. తాను సముద్రంలో విలీనం – ఫ్లోరిడాలో హృదయవిదారక ఘటన

POPULAR CATEGORY

  • Andhra Pradesh2451
  • Telangana2143
  • National1479
  • Others1411
  • InterNational732
  • Films News500
  • ID CARDS 2025495
  • Hyderabad372
Logo

ABOUT US

Welcome to A1 TV Telugu—your trusted digital news network. From ground-level reporting to high-level debates, we bring you 24/7 coverage of the stories that matter most. Stay informed, stay ahead.

Contact us: contact@a1tvtelugu.com

FOLLOW US

Facebook
Instagram
Twitter
Website
Youtube

© 2026 A1tv Telugu news. All Rights Reserved.

  • Terms and Conditions
  • Disclaimer
  • Contact
  • Privacy Policy
imunify-bot-check