Wednesday, April 8, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతిరువూరు అభివృద్ధికి 11,500 ఉద్యోగాల ప్రణాళిక - కొలికపూడి

తిరువూరు అభివృద్ధికి 11,500 ఉద్యోగాల ప్రణాళిక – కొలికపూడి

-

Chat on WhatsApp

తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు యువతకు అద్భుత శుభవార్త అందించారు. తన తొలి ప్రెస్ మీట్‌లోనే నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 11,500 ఉద్యోగాల అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

కొలికపూడి మాట్లాడుతూ, తిరువూరును ఒక పెద్ద పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దీనివల్ల నియోజకవర్గం ఆర్థికంగా ముందుకు వెళుతుందని అభిప్రాయపడ్డారు.

నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని కొలికపూడి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చలు జరిపి, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను త్వరగా పొందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే స్థానికంగా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.

తిరువూరులో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడమే తన లక్ష్యమని కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ సహకారంతో పారిశ్రామిక వృద్ధి త్వ‌రితగతిన జరిగేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

india wins gold in issf world cup shooting with world record

Palak-Mukesh | పాలక్-ముకేశ్ అదుర్స్.. ISSF ప్రపంచకప్‌లో స్వర్ణం

Palak-Mukesh: అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచకప్‌లో భారత షూటర్లు అదిరిపోయే ప్రదర్శనతో సంచలనం సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో భారత జంట పాలక్, ముకేశ్ నెల్లవల్లి...
- Advertisement -
Chat on WhatsApp