వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య డిమాండ్

Botsa Appalanarasayya leading a protest rally against medical college privatization in Vizianagaram Former MLA Botsa Appalanarasayya leading a massive protest rally in Vizianagaram against the privatization of government medical colleges.

విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. వైసీపీ(ysrcp) అధినేత జగన్ ఆదేశాల మేరకు బొత్స అప్పలనరసయ్య నేతృత్వంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, “ప్రభుత్వ వైద్య కళాశాలలు సాధారణ ప్రజలకు ఆరోగ్య సేవల ప్రధాన కేంద్రాలు.

ALSO READ:Chandrababu Naidu:మార్చి లోపు 5.8 లక్షల ఇళ్ల పూర్తి చేయాలని సీఎం ఆదేశం

వీటిని ప్రైవేటు చేతుల్లోకి అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం,” అని అన్నారు. ప్రభుత్వ విధానాలపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత బలపరుస్తామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *