Monday, July 27, 2026
Chat on WhatsApp
HomeOthersమారుతీ సుజుకి ఎలక్ట్రిక్ SUV లాంచ్‌ కు సిద్దం

మారుతీ సుజుకి ఎలక్ట్రిక్ SUV లాంచ్‌ కు సిద్దం

-

Chat on WhatsApp

ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి, ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ SUV (ఈవీఎక్స్) ను మార్కెట్‌లోకి త్వరలో విడుదల చేయనుంది. ధర రూ.25 లక్షల వరకు ఉండనుంది.

ఈవీ కార్లకు చార్జింగ్ వసతులు కల్పించడం కీలక సమస్యగా మారుతుండగా, మారుతి సుజుకి దేశవ్యాప్తంగా 25 వేల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.

మారుతి సుజుకి 5,100 పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నప్పటికీ, పెట్రోల్ బంకుల వద్ద ఈవీ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది.

ప్రతి సర్వీస్ సెంటర్‌లో కనీసం రెండు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం మారుతి ప్రణాళికలు రూపొందిస్తోంది. చార్జింగ్ పాయింట్ల కోసం ప్రత్యేక బేలు ఏర్పాటు చేస్తోంది.

బెంగళూరులోని మారుతి సుజుకి సర్వీస్ మెకానిక్‌లకు ఈవీ కార్ల చార్జింగ్, నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. చార్జింగ్ స్టేషన్లకు మౌలిక వసతులు కల్పించే పనిలో ఉంది.

కేంద్ర చమురు సంస్థలతో చర్చలు జరిపి పెట్రోల్ బంకుల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలను రిజర్వ్ చేయమని మారుతి సుజుకి సూచించింది.

మారుతి సుజుకి ప్రారంభ మూడు నెలల్లోనే 3,000 ఈవీఎక్స్ SUV లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కంపెనీకి కొత్త స్థాయి విజయాలను తెచ్చే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా 25 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు, కొత్త SUV కి భారీ డిమాండ్ ఉందని, మార్కెట్‌లో దూసుకుపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Floodwater entering Jurala Project on the Krishna River in Telangana

Heavy rains |  కృష్ణమ్మకు మళ్లీ జలకళ.. జూరాలకు పెరుగుతున్న వరద ప్రవాహం

Heavy rains: ఉపరాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి మళ్లీ సమృద్ధిగా నీరు చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది ఉప్పొంగి, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు...
- Advertisement -
Chat on WhatsApp