భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి పెద్ద మార్పు రానుంది. కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ విలీనం 2.0 (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రణాళిక అమలులోకి వస్తే, దేశంలో కేవలం నాలుగు ప్రధాన ప్రభుత్వ బ్యాంకులు “స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్ మాత్రమే మిగిలే అవకాశం ఉంది.
ఈ విలీనాల ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకింగ్ వ్యవస్థను బలపరచడం, మూలధన సామర్థ్యాన్ని పెంచడం, మరియు రుణాల మంజూరును వేగవంతం చేయడం.
ALSO READ:ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్
ఈ ప్రణాళిక ప్రకారం మధ్యతరహా బ్యాంకులు “ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) వంటి సంస్థలను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయనున్నారు.
దీతో రిస్క్ మేనేజ్‌మెంట్ బలపడుతుంది, శాఖల పునర్‌వ్యవస్థీకరణ సులభమవుతుంది. 2019లో 27 బ్యాంకులను 12కి తగ్గించినట్లే, ఈ దశ కూడా వ్యవస్థను సమర్థవంతం చేస్తుంది.
ప్రభుత్వం పెద్ద బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలని భావిస్తోంది. అయితే, సిబ్బంది సమన్వయం, శాఖల తగ్గింపు, ఉద్యోగ భద్రత వంటి సవాళ్లు ఉన్నా, ఈ విలీనం విజయవంతమైతే భారత బ్యాంకింగ్ రంగం మరింత స్థిరంగా మారి, $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం వైపు వేగంగా అడుగులు వేస్తుంది.
