ప్రజాకవి అందెశ్రీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. అంత్యక్రియలకు వ్యక్తిగతంగా హాజరైన సీఎం, అందెశ్రీ పార్థివదేహం ముందు మౌనంగా నివాళి అర్పించారు. అనంతరం పాడె మోసి చివరి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంలో అందెశ్రీతో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రేవంత్ భావోద్వేగానికి గురయ్యారు.
అందెశ్రీ రాసిన కవిత్వం తెలంగాణ ప్రజల హృదయాల్లో నాటుకుపోయిందని, ఆయన సాహిత్యం ఉద్యమానికి ఊపిరినిచ్చిందని సీఎం పేర్కొన్నారు. “అందెశ్రీ కవిత్వం తెలంగాణ ఆత్మను ప్రతిబింబించింది.
ALSO READ:ఢిల్లీ బాంబు పేలుడులో కీలక విషయం వెలుగులోకి..! భయంతో ఆత్మాహుతి దాడి
ఆయన వంటి సాహితీవేత్తను కోల్పోవడం తెలంగాణకు పెద్ద నష్టం” అని రేవంత్ రెడ్డి అన్నారు.
మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు కూడా అంత్యక్రియల్లో పాల్గొని అందెశ్రీ పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను ఓదార్చిన తర్వాత సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రజాకవి పట్ల ఆయన చూపిన గౌరవం, పాడె మోసిన సన్నివేశం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
