ఏఆర్ రెహమాన్ లైవ్ షోలో చరణ్ భావోద్వేగం… నా కల నెరవేరింది

రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ షోలో పాల్గొన్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా “పెద్ది” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఏఆర్ రెహమాన్ లైవ్ మ్యూజిక్ షోలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో చరణ్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సాన్నిధ్యం వహించారు.

రెహమాన్ తన ఎవర్‌గ్రీన్ పాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. “యువ”, “రోజా”, “రంగ్ దే బసంతి”, “ఫనా”, “ఏ మాయ చేశావే” వంటి సాంగ్స్‌తో వేదిక ఉత్సాహంగా మారింది.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, “నేను చిన్నప్పటి నుంచే ఏఆర్ రెహమాన్ సంగీతానికి అభిమానిని. ఆయన ట్యూన్స్‌లో నటించడం నా కల. ఇప్పుడు ‘పెద్ది’తో ఆ కల నెరవేరింది.

RAM CHARAN PEDDI MOVIE

ఇది నా కెరీర్‌లో గోల్డెన్ మోమెంట్” అని భావోద్వేగంగా తెలిపారు. ఆయన మాటలకు అభిమానులు చప్పట్లతో స్పందించారు.

ఈ వేడుకలో రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ “చికిరి చికిరి” సాంగ్‌ను లైవ్‌లో ఆలపించగా, చరణ్, జాన్వీ డ్యాన్స్‌తో స్టేజ్‌ కదిలిపోయింది. రెహమాన్ కూడా తెలుగు ప్రేక్షకులపై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, “నా సంగీత ప్రయాణం తెలుగుతోనే ప్రారంభమైంది” అన్నారు.

ALSO READ:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అలజడి.. బాంబ్ స్క్వాడ్ సోదాలు

శ్వేతా మోహన్, రక్షిత సురేశ్, రంజిత్ బరోట్ తదితర గాయకులు కూడా తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. మొత్తం మీద, రామ్ చరణ్ – రెహమాన్ కలయికతో “పెద్ది” సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *