అమలాపురం బాలిక మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు.అమలాపురం పట్టణంలో మిస్సింగ్ అయిన ఐదవ తరగతి బాలిక ఆచూకీ లభ్యమైంది. నిన్న సాయంత్రం పాపను మేనమామ వరసకు చెందిన వ్యక్తి తీసుకెళ్లిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. పోలీసులు వెంటనే శోధనా చర్యలు ప్రారంభించారు.
రాత్రంతా జరిగిన ముమ్మర గాలింపు చర్యల అనంతరం ఈరోజు ఉదయం పి.గన్నవరం మండలం ఎర్రంశెట్టి వారి పాలెం వద్ద బాలికను పోలీసులు కనుగొన్నారు.
ALSO READ:బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఓటు హక్కు వినియోగం
అమలాపురం పట్టణ సీఐ “వీరబాబు” ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రాత్రంతా గాలింపు చేపట్టాయి. చివరకు బాలికను సురక్షితంగా కనుగొని, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉంచారు.
త్వరలోనే పాపను తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు సీఐ వీరబాబు తెలిపారు. కిడ్నాపర్‌పై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
