Thursday, April 16, 2026
Chat on WhatsApp
HomeInterNational''రేణు దేశాయ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్"

”రేణు దేశాయ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్”

-

Chat on WhatsApp

నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా తరచూ తన ఆలోచనలు, భావోద్వేగాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ తాత్వికమైన సందేశం నెటిజన్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. “క్రీడల ముసుగులో ఇతరుల్ని బాధపెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు?” అంటూ రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ప్రశ్నించారు. ఈ వాక్యం సామాన్యంగా ఉన్నా, దానికున్న లోతైన అర్థాన్ని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. జంతు ప్రేమికురాలిగా పేరొందిన రేణు, మూగజీవాల సంరక్షణ, హక్కుల కోసం ఆమె పెట్టే పోస్టులు తరచూ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం చేసిన ఈ కామెంట్ కూడా అదే తరహాలో ఉందని పలువురు భావిస్తున్నారు. వినోదం, ఆటల పేరుతో జంతువులపై హింసను కండించేందుకు ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ వ్యక్తిగత అభిప్రాయాలను గౌరవిస్తూ తన అభిమానం చూపే వారు ఈ పోస్టును మెచ్చుకుంటున్నారు. మానవత్వం, జాలితో కూడిన ఆమె యొక్క పోస్ట్‌లు పలువురికి ఆలోచనలకు దారి తీస్తున్నాయి. తన అభిప్రాయాలను నెమ్మదిగా, కానీ బలంగా వ్యక్తపరిచే రేణు దేశాయ్… మరోసారి తన తాత్వికతతో సోషల్ మీడియాలో చర్చకు కేంద్ర బిందువైయ్యారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Severe heatwave conditions in Andhra Pradesh with rising temperatures and sun exposure warning

AP Heatwave | రాష్ట్రంలో హీట్‌వేవ్ అలర్ట్…ఇంట్లోనే ఉండాలని హెచ్చరిక

AP Heatwave: ఏపీలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తాజా హెచ్చరికల ప్రకారం, ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 275 మండలాల్లో ఇప్పటికే 40°C...
- Advertisement -
Chat on WhatsApp