Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeNationalఢిల్లీ ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

ఢిల్లీ ద్వారకలో ఘోర అగ్ని ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

-

Chat on WhatsApp

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతం షాపత్ సొసైటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతి చెందారు.ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో కుటుంబం భయంతో ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీకి పరుగులు తీశారు . పరిస్థితిని తట్టుకోలేక వారు బాల్కనీ నుంచి దూకారు. అయితే, ఈ ప్రయత్నంలో తండ్రి యశ్ యాదవ్, అతని ఇద్దరు పదేళ్ల పిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ప్రారంభమై సొసైటీ 8వ మరియు 9వ అంతస్తులకు వ్యాపించింది. మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివసిస్తున్నవారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి, అగ్ని ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద నివారణ చర్యలు మరియు భద్రతా ప్రమాణాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp