Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaటీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం

-

Chat on WhatsApp

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కాంగ్రెస్ నేతల సమక్షంలో అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు.

జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, కాంగ్రెస్ ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఎంఐఎం మద్దతుతో మైనారిటీ వర్గాన్ని ఆకర్షించాలన్న ప్రయత్నంగా ఇది భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌పై “మైనారిటీలకు కేబినెట్‌లో ప్రాధాన్యం ఇవ్వలేద”ని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆ విమర్శలకు చెక్ పెట్టే ఉద్దేశంతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ నియామకాన్ని ప్రతిపాదించిన రాష్ట్ర కేబినెట్, ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రి వర్గంలోకి తీసుకోవడం విశేషం. అజారుద్దీన్‌కు హోం మంత్రిత్వ శాఖ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆసక్తికరంగా, ఆయన మంత్రిత్వ నిర్ణయం గురించి కొంతమంది మంత్రులకు మీడియా ద్వారా మాత్రమే తెలిసిందని చెబుతున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp