అన్యాయాన్ని అడ్డుకొన్న యువత పై అక్రమ అరెస్టులు,కేసులు చేయకుండా నిజ నిజాలు తెలుసుకుని పూర్తి దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన పలువురు మహిళలు,హిందూ ధర్మ రక్షక సమితి సభ్యులు శుక్రవారం పట్టణంలోని ఏఎస్పీ అవినాష్ కుమార్ కార్యాలయoలో తమ బాధను విన్నవించి,వినతి పత్రం అందించారు.అనంతరం పలువురు మాట్లాడుతూ…
రెండు రోజుల క్రితం కుబీర్ మండలానికి చెందిన ఓ వర్గనికి చెందిన మైనర్ అమ్మాయిని బెదిరించి,అత్యాచారానికి యత్నించిన మరొక వర్గనికి చెందిన యువకుడిని పలువురు హిందువులు అడ్డుకొన్నారని, అట్టి వ్యక్తులపై హత్యాయత్నం కేసులు లాంటివి నమోదు చేయడం తొలగించాలని,డిమాండ్ చేస్తు వినతి పత్రాన్ని అందజేసారు.అక్రమ కేసులతో యువత కుటుంబీకులు భయబ్రాంతులకు గురి అవుతున్నారని,అట్టి యువకుని చరవాణిలో కత్తులు,తల్వార్లు,గన్ లతో ఉన్న ఫోటోస్ వున్నాయని,
అలాంటి వ్యక్తి ఎక్కడి వాడు,అతని షాప్,ఇండ్లలొ సోదాలు చేసి అతనికి ఉగ్రవాదులతొ,ఇంకా ఎవరితో అయిన సంబందాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టాలని కోరారు.