ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొమ్మూరు గ్రామం లో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు.
పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా కొమ్మూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సిసి రోడ్ల నిర్మాణానికి కొమ్మూరు గ్రామం లో 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం.
పల్లె పండుగ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఒక వరం లాంటిది.
ప్రభుత్వం చేస్తున్న పల్లెల అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది.
ప్రతిపక్షం ఎన్ని ఆరోపణలు చేసిన మా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి చేయటమే
ప్రతిపక్ష విమర్శలకు మేము విమర్శలు చేస్తా ప్రజలిచ్చిన సమయం వృధా చేయమని ప్రజలిచ్చిన అవకాశాన్ని అభివృద్ధి వైపు మలుచుతామని తెలిపారు .
అధికారుల తీరుపై ఎమ్మెల్యే గరం గరం
కొమ్మూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న గ్రామస్తులు స్థానిక శాసనసభ్యులు బూర్ల రామాంజనేయుల కు తెలిపారు.
వెంటనే స్పందించిన శాసనసభ్యులు గత ప్రభుత్వంలో పంచాయతీలో జరిగిన పనుల వివరాలు వాటికి వినియోగించిన నిధుల వివరాలు సాయంత్రం లోపు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని హెచ్చరించారు.
ఇప్పటికైనా అధికారులు తమ యొక్క స్వభావాలు మార్చుకోకపోతే
చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు.