HomeNationalCM Vijay | సీఎంగా విజయ్ ఏకగ్రీవం...ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?

CM Vijay | సీఎంగా విజయ్ ఏకగ్రీవం…ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?

-

Chat on WhatsApp

CM Vijay: తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు నటుడు విజయ్‌ను తమ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెన్నైలోని పనైయూర్ పార్టీ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించడంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. దీంతో ఇతర పార్టీల మద్దతు కోసం టీవీకే నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అలాగే పీఎంకే మద్దతు ఇవ్వవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ మద్దతు లభిస్తే టీవీకే మ్యాజిక్ ఫిగర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విజయ్ త్వరలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు వారాల్లో మెజార్టీ నిరూపిస్తామని గవర్నర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. అలాగే గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది.

ఇక విజయ్ ఈ ఎన్నికల్లో పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. నియమాల ప్రకారం ఒకే నియోజకవర్గాన్ని కొనసాగించాల్సి ఉండటంతో ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. తిరుచ్చి ఈస్ట్‌ను వదిలి పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

మొత్తానికి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తుండటంతో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp