అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1-బీ వీసాలపై తన కఠిన వైఖరి నుంచి వెనక్కి తగ్గడం భారతీయ టెక్ నిపుణులకు పెద్ద ఊరటగా లభించింది.వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్–సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాలో టెక్నాలజీ రంగ అభివృద్ధికి విదేశీ నైపుణ్యం అవసరం ఉండటంతో వేలాది మందిని స్వాగతిస్తామని ప్రకటించారు.
అరిజోనాలో నిర్మించనున్న బిలియన్ డాలర్ల చిప్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులకు నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ తప్పనిసరి కాబట్టి, అర్హులైన నిపుణులను విదేశాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ALSO READ:Rahul Gandhi EC Allegations | రాహుల్ గాంధీ ఆరోపణలపై ప్రముఖుల లేఖ
వారి ద్వారా అమెరికన్లకు సాంకేతిక శిక్షణ కూడా అందుతుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో తన సొంత పార్టీ ‘మాగా'(MAGA) వర్గంలో విమర్శలు వచ్చే అవకాశం ఉందని ట్రంప్ అంగీకరించినప్పటికీ, ఇది అమెరికా ప్రయోజనాలకే అనుకూలమని స్పష్టం చేశారు.
కానీ రిపబ్లికన్ పార్టీ(Republican Party)లో మార్జోరీ టేలర్ గ్రీన్ వంటి నేతలు హెచ్1-బీ వీసా(H1B Visa)లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో వైట్‌హౌస్ మాత్రం వీసా దుర్వినియోగం తగ్గించేందుకే లక్ష డాలర్ల దరఖాస్తు రుసుమును ప్రతిపాదించినట్లు తెలిపింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2024లో జారీ చేసిన హెచ్1-బీ వీసాల్లో 70%కుపైగా భారతీయులే పొందారు.
