Sunday, April 5, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవేటపాలెం మండలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

వేటపాలెం మండలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

-

Chat on WhatsApp

వేటపాలెం మండల పరిధిలోని నాయనపల్లి గ్రామం చల్లారెడ్డిపాలెం పంచాయతీ సచివాలయం సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కొత్త కాలవ స్టేట్ కట్ పక్కనే ఉన్న బొచ్చురోల పాలెం ఎత్తు పోతన పథకం సమీపంలో ఈ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

మృతదేహం సమీపంలో చేపలు పట్టే యానాదులు ఉండటంతో, వారు దీనిని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మృతదేహాన్ని చీరాల ఏరియా హాస్పిటల్‌కి తరలించి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతుడి గుర్తింపు వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇది సహజ మరణమా? లేక మర్డరా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

adivi sesh and mrunal thakur in dacoit movie trailer scene

Dacoit Movie | డెకాయిట్‌ మూవీ ట్రైలర్ విడుదల…అడివి శేష్, మృణాల్ కేమిస్ట్రీ హైలైట్

Dacoit Movie: అడివి శేష్‌ హీరోగా రాబోయే రొమాంటిక్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్‌’ ట్రైలర్ విడుదల అయింది. ఈ చిత్రాన్ని షానీల్ డియో దర్శకత్వం వహించారు. హీరోగా అడివి శేష్‌, హీరోయిన్‌గా మృణాల్...
- Advertisement -
Chat on WhatsApp