Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeNationalసెలవు రాకపోవడంతో యువకుడు ఆన్‌లైన్‌లో వివాహం

సెలవు రాకపోవడంతో యువకుడు ఆన్‌లైన్‌లో వివాహం

-

Chat on WhatsApp

తుర్కియేలో ఉద్యోగం చేస్తున్న అద్నాన్ మహ్మద్, సెలవు రాకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న వధువుతో అతడు వర్చువల్ వివాహం జరిపించుకున్నాడు. వధువు తాతయ్య అనారోగ్యంతో ఉండటం, త్వరగా పెళ్లి కావాలని పట్టుబట్టడంతో ఇరు కుటుంబాలు ఆన్‌లైన్ పెళ్లికి అంగీకరించాయి.

ఈ వర్చువల్ పెళ్లి ఆదివారం బరాత్‌తో ప్రారంభమైంది. సోమవారం పెళ్లి జరిగింది. వీడియో కాలింగ్ ద్వారా ఖాజీ పెళ్లి జరిపించారు. వివాహంలో వధూవరులు ‘ఖుబూల్ హై’ అని మూడు సార్లు చెప్పించి ఆచారం ప్రకారం వివాహం జరిగింది.

పెళ్లికూతురు బంధువు అక్రమ్ మహ్మద్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత వల్లే ఈ వివాహం సాధ్యమైందని చెప్పారు. ఇరు కుటుంబాలు ఈ పెళ్లి విధానాన్ని అంగీకరించడంతో ఆనందం వ్యక్తం చేశాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

actress trisha reacts to marriage and movie retirement rumours

Trisha | రూమర్లకు ఫుల్‌స్టాప్.. త్రిష ఒక్క పోస్టుతో క్లారిటీ

Trisha: నటి త్రిష గురించి సోషల్ మీడియాలో తిరుగుతున్న పెళ్లి, సినిమాలకు గుడ్‌బై, రాజకీయాల్లోకి ఎంట్రీ వంటి ఊహాగానాలకు ఆమె ఒక్క ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతోనే బలమైన కౌంటర్ ఇచ్చారు. “అవును… నేను సినిమాలు...
- Advertisement -
Chat on WhatsApp