Wednesday, March 4, 2026
No menu items!
Google search engine
HomeAndhra PradeshTTD Laddu Ghee Adulteration | సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో పెద్ద కుంభకోణం

TTD Laddu Ghee Adulteration | సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో పెద్ద కుంభకోణం

- Advertisement -
Google search engine

TTD Ghee Scam: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి సరఫరాలో జరిగిన నిర్లక్ష్యపూరిత చర్యలు పెద్ద కుంభకోణంగా మారాయి. ఈ వ్యవహారంలో టీటీడీ(TTD) కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది.

అర్హతలేని డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన పలుమార్లు లంచాలు తీసుకున్నారని నివేదిక పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా విధులు నిర్వర్తిస్తున్నారు.

సిట్ దర్యాప్తు ప్రకారం, 2021 జులై నుంచి 2023 నవంబర్ మధ్యకాలంలో భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా వంటి డెయిరీల ప్రతినిధుల నుంచి రూ.3.50 లక్షలు, రూ.50 వేల విలువైన శాంసంగ్ ఫోన్, రూ.16,700 విలువైన వెండి ప్లేటు, వెండి నాణేలు స్వీకరించినట్లు తేలింది.

ALSO READ:Bengaluru airport | బెంగుళూరు ఎయిర్‌పోర్టులో రూ.200 కోట్ల గంజాయి సీజ్

ఈ డెయిరీల ప్లాంట్లను సరిగా పరిశీలించకుండానే సాంకేతిక కమిటీ అర్హతలు ఉన్నట్లు నివేదిక ఇవ్వడం వల్ల వాటికి కాంట్రాక్టులు సులభంగా లభించాయి.

అత్యంత కీలక అంశం ఏమిటంటే సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ ఉందని మైసూరు సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నివేదిక స్పష్టంగా చెబుతున్నా, ఆ నివేదికను సుబ్రహ్మణ్యం దాచిపెట్టారని సిట్ తెలిపింది.

నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలపబడినట్లు నిర్ధారణ అయినప్పటికీ, ఆ సరఫరాలను ఆపకుండా యథావిధిగా కొనసాగించారు.

గతంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ ఫిర్యాదుతో భోలేబాబా డెయిరీ అర్హత లేదని సుబ్రహ్మణ్యం కమిటీనే నివేదిక ఇచ్చింది.

అయినప్పటికీ తరువాత అదే సంస్థకు సరఫరా ఆర్డర్ ఇవ్వడం ఆయన ప్రమేయాన్ని మరింత స్పష్టంగా చూపుతోందని సిట్ పేర్కొంది. ఈ వ్యవహారంతో డెయిరీలకు కోట్ల రూపాయల లాభం చేకూరగా, భక్తుల నమ్మకానికి పెద్ద దెబ్బ తగిలిందని దర్యాప్తు తేల్చింది.

YouTube thumbnailYouTube icon
- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular