Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaTG DEECET 2026 రిజల్ట్స్ విడుదల ఈ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు

TG DEECET 2026 రిజల్ట్స్ విడుదల ఈ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు

-

Chat on WhatsApp

TG DEECET 2026 results: తెలంగాణ డీఈఈసెట్ (DEECET)–2026 ఫలితాలను అధికారులు శనివారం అధికారికంగా విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, జూన్ 6 నుంచి జూన్ 8, 2026 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ ప్రవేశ పరీక్ష ఆధారంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (D.P.S.E) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కోర్సుల ప్రవేశాల కోసం ఫిబ్రవరి 27, 2026న నోటిఫికేషన్ విడుదల చేయగా, మే 21న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు.

మొత్తం 25,054 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, వారిలో 21,137 మంది అర్హత సాధించారు. దీంతో మొత్తం ఉత్తీర్ణత శాతం 84.36గా నమోదైంది. ర్యాంకర్ల జాబితాలో తెలుగు మీడియంలో బి. ఆనంద్ 76 మార్కులతో మొదటి ర్యాంక్ సాధించారు.

ఇంగ్లీష్ మీడియంలో జవ్వాజీ శివ నాగేశ్వర్ 83 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. ఉర్దూ మీడియంలో దానిష్ అహ్మద్ 66 మార్కులతో తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకున్నారు. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి, నిర్ణీత గడువులో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp