Thursday, July 23, 2026
Chat on WhatsApp
HomeTelanganaTelangana Rural Election | తెలంగాణలో ఎన్నికల కౌంట్‌డౌన్.. మేలో పోలింగ్‌

Telangana Rural Election | తెలంగాణలో ఎన్నికల కౌంట్‌డౌన్.. మేలో పోలింగ్‌

-

Chat on WhatsApp

Telangana Rural Election: తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

జిల్లా ప్రజాపరిషత్‌ (ZPTC), మండల ప్రజాపరిషత్‌ (MPTC) ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల ప్రకారం, 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు నవీకరించిన ఓటర్ల వివరాలను మండలాల వారీగా సేకరించి, వాటిని గ్రామపంచాయతీలు, పోలింగ్ కేంద్రాల జాబితాల్లో చేర్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

కొత్త ఓటర్ల జాబితాల తయారీ

ఎంపీటీసీ, జడ్పీటీసీ పరిధిలోని గ్రామాల వారీగా కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరణ అనంతరం,సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మార్గదర్శకాల ప్రకారం ఈ జాబితాలను పోలింగ్ స్టేషన్లకు అనుసంధానం చేస్తారు.

డేటాలో లోపాలు ఉంటే ఈ నెల 23లోపు నివేదించాలని సూచించారు. ఆపై ముసాయిదా జాబితాలు విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తారు.

గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ

చివరిసారిగా 2019లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే 2025లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది.

తర్వాత గ్రామపంచాయతీలు, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పుడు అదే రిజర్వేషన్ విధానంతో మళ్లీ ఈ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

స్థానాల సంఖ్యలో మార్పులు

ప్రస్తుతం రాష్ట్రంలో 566 జడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. మెడ్చల్-మల్కాజిగిరి జిల్లా అర్బన్‌గా మారడంతో జిల్లా పరిషత్ జాబితా నుంచి తొలగించబడింది. గ్రామాల విలీనాల కారణంగా గతంతో పోలిస్తే కొన్ని స్థానాలు తగ్గాయి.

మేలో ఎన్నికలపై ఫోకస్

రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో గ్రామీణ రాజకీయాల్లో మళ్లీ చురుకుదనం పెరగనుంది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp