నిర్మల్ జిల్లాలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ చౌక్ నుండి వివేకానంద చౌక్ వరకు సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొని, ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్(Telangana Scholarships) మరియు ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వి. మహేందర్ మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా 8-9 వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా విద్యా రంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రీయింబర్స్‌మెంట్ అందక అనేక ప్రైవేట్ కళాశాలలు మూతపడిన పరిస్థితి ఏర్పడిందని, ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ప్రభుత్వం వైఫల్యమని అన్నారు.
ALSO READ:Sardar Vallabhbhai Patel 150th jayanthi:సర్దార్ పటేల్ స్ఫూర్తితో దేశ ఏకత కోసం ఐక్యత మార్చ్
నిర్మల్ జిల్లాలో అద్దె భవనాల్లో నడుస్తున్న వసతిగృహాలకు సొంత భవనాలు కట్టాలని, జిల్లాలో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు ప్రతి నెల రూ.500 కాస్మొటిక్ చార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పవార్ కిరణ్, రాష్ట్ర నాయకులు అనిల్, జిల్లా నాయకులు అద్విత్, గంగరాజు, ధ్రువతో పాటు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు.
