HomeTelanganaTelangana new DGP | తెలంగాణ డీజీపీ మార్పు.. సీవీ ఆనంద్‌కు బాధ్యతలు

Telangana new DGP | తెలంగాణ డీజీపీ మార్పు.. సీవీ ఆనంద్‌కు బాధ్యతలు

-

Chat on WhatsApp

Telangana new DGP: తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త నియామకం చేపట్టారు.

కేంద్ర ప్రజాసేవల ఎంపిక సంఘం (UPSC) ఇటీవల రాష్ట్రానికి అర్హుల జాబితాను పంపింది. ఆ జాబితాలో సీవీ ఆనంద్‌తో పాటు 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా పేర్లు ఉన్నాయి. వీరిలో అనుభవం, సేవాకాలం ఆధారంగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం కొత్త డీజీపీగా ఎంపిక చేసింది.

పోలీస్ శాఖలో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించిన సీవీ ఆనంద్‌కు విస్తృత అనుభవం ఉంది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ క్రైమ్ నియంత్రణ వంటి విభాగాల్లో ఆయన సేవలు గుర్తింపు పొందాయి.

కొత్త డీజీపీగా ఆయన బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Lionel Messi | మెస్సీ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి జార్జ్ మెస్సీ కన్నుమూత

Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ తండ్రి, ఆయన కెరీర్‌కు బలమైన అండగా నిలిచిన జార్జ్ మెస్సీ (68)...
- Advertisement -
Chat on WhatsApp