Telangana Movement History: తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు నేటితో పదహారేళ్లు పూర్తయ్యాయి. 2009 నవంబర్ 29న తెలంగాణ సాధన కోసం ఆయన కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట జిల్లా రంగధాంపల్లి ప్రాంతానికి బయలుదేరి దీక్ష ప్రారంభించే ప్రయత్నం చేశారు.
అయితే అప్పటి పోలీసులు ఆయనను అక్కడికే అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు.
ALSO READ:iBomma Ravi | డబ్బు కోసమే పైరసీ చేశా..మళ్లీ పైరసీ జోలికి వెళ్లను
జైలులో ఉన్నప్పుడే కేసీఆర్ నిరాహార దీక్ష కొనసాగించగా, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం వేగవంతమైంది. తెలంగాణ ప్రాంతంలో నిరసనలు, రహదారి రోకాయలు, విద్యార్థి ఉద్యమాలు విస్తరించాయి. కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది.
చివరకు కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ హామీ అనంతరం కేసీఆర్ తన దీక్షను విరమించారు.
ఈ పరిణామం తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పిన ఘట్టంగా, రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన ప్రధాన సంఘటనగా గుర్తించబడుతోంది.
