హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మొత్తం 37 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి(DGP Shivadher Reddy) ఎదుట లొంగిపోయారు(Maoists Surrender). ఈ సందర్భంగా వారు భారీ సంఖ్యలో ఆయుధాలను అప్పగించారు.
ALSO READ:AP Local Body Elections:ఏపీలో స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం
303 రైఫిల్స్, జీ3 రైఫిల్స్, ఏకే-47లు, ఎస్‌ఎల్‌ఆర్ తుపాకులు, అలాగే పెద్ద మొత్తంలో బుల్లెట్లు పోలీసుల స్వాధీనం అయ్యాయి. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉండటం విశేషం. అగ్రశ్రేణి మావోయిస్టు నాయకులు ఆజాద్, అప్పాసీ, నారాయణ, ఎర్రాలు కూడా ఈ లొంగుబాటులో భాగమయ్యారు.
ముఖ్యంగా, కోయ సాంబయ్య అలియాస్ ఆజాద్ గత 31 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి ఈ రోజు అధికారుల ఎదుట ఆత్మసమర్పణ చేయడం కీలక పరిణామంగా భావిస్తున్నారు. రాష్ట్ర పోలీసుల నిరంతర కంబింగ్ ఆపరేషన్లు, పునరావాస పథకాల వల్లే ఈ లొంగుబాటు సాధ్యమైందని డీజీపీ పేర్కొన్నారు.
