Telangana Jagruti:మా పార్టీతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు

Telangana Jagruti president Kalvakuntla Kavitha speaking to media in Nalgonda Telangana Jagruti president Kalvakuntla Kavitha speaking to media in Nalgonda

నల్గొండ:తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా మా పార్టీతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే జాగృతి లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మాట్లాడుతూ, సిబ్బంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన వసతులు లేకపోవడం బాధాకరమని అన్నారు.


ALSO READ:Red Fort blast victims:ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన మోదీ 

అదే సమయంలో, “జాగృతి సంస్థతో పెట్టుకున్నవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు” అంటూ హెచ్చరించారు. జిల్లాలో పెద్ద నాయకులు ఉన్నప్పటికీ అభివృద్ధి వెనుకబడిందని, ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలమైందని విమర్శించారు.అలాగే జిల్లా కేంద్రంలో తన ఫ్లెక్సీని చించివేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పార్టీ నాయకులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు జాగృతి కార్యక్రమాలను విమర్శించడమే పనిగా చేసుకున్నారని కవిత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *