Friday, February 27, 2026
No menu items!
Google search engine
HomeTelanganaTelangana | ఒకే జిల్లాకు గవర్నమెంట్ హోదాలో భార్య, భర్త

Telangana | ఒకే జిల్లాకు గవర్నమెంట్ హోదాలో భార్య, భర్త

- Advertisement -
Google search engine

Telangana: తెలంగాణ ప్రభుత్వ బదిలీల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్ అధికారులను ఒకేసారి బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాకు కొత్త కలెక్టర్‌గా స్నేహా శబరీశ్(Sneha Shabarish) నియమితులవడం విశేషం.

అదే జిల్లాలో ఆమె భర్త శబరీశ్ ఎస్పీగా కొనసాగుతున్నారు. భార్య కలెక్టర్‌గా, భర్త జిల్లా పోలీసు అధికారి‌గా ఒకే జిల్లాలో పనిచేయడం రాష్ట్ర పరిపాలనలో అరుదైన సంఘటనగా మారింది.

స్నేహా శబరీశ్ గతంలో హనుమకొండ కలెక్టర్‌గా సేవలందించారు. ఆమె స్థానంలో చాహత్ బజ్‌పాయ్ నియమితులయ్యారు.

2017 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్నేహా, నిజామాబాద్‌లో అసిస్టెంట్ కలెక్టర్‌గా తన సేవలను ప్రారంభించి, జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్‌గా కూడా పనిచేశారు. పాలనలో ప్రతిభ కనబరిచిన అధికారిగా గుర్తింపు పొందారు.

ఇతర బదిలీల్లో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా సంజయ్ కుమార్, సాగునీటి శాఖ ప్రధాన కార్యదర్శిగా ఈ. శ్రీధర్, సమాచార సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియమితులయ్యారు. ఆర్థిక శాఖలో గౌరవ్ ఉప్పల్, సిక్తా పట్నాయక్ కీలక బాధ్యతలు చేపట్టారు.

విపత్తు నిర్వహణ బాధ్యతలను దాన కిషోర్‌కు అప్పగించగా, సాధారణ పరిపాలన విభాగాన్ని రాహుల్ బొజ్జా చూసుకోనున్నారు. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకాలతో పరిపాలనలో కొత్త ఉత్సాహం నెలకొంది.

ALSO READ:Rain alert | తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన…ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

- Advertisement -
Google search engine
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular