ట్రంప్:ప్రపంచాన్ని 150 సార్లు పేల్చగల శక్తి అణు సామర్థ్యం మా దగ్గర ఉంది
అమెరికా వద్ద ప్రపంచాన్ని “150 సార్లు పేల్చగల అణు సామర్థ్యం” ఉందని అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్” మరోసారి స్పష్టం చేశారు. వైట్‌హౌస్‌లో విలేకర్లతో మాట్లాడిన ట్రంప్, అణ్వాయుధ నిరాయుధీకరణపై మాట్లాడుతూ, అమెరికా అణు శక్తిలో ప్రపంచంలో ముందంజలో ఉందని, ఆ తరువాత స్థానాల్లో రష్యా మరియు చైనా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, “అణు నిరాయుధీకరణ గొప్ప ఆలోచన అయినప్పటికీ, దానిపై ఇప్పటికే పుతిన్, జిన్‌పింగ్‌లతో చర్చించాను. కానీ ప్రపంచం మొత్తం అణ్వాయుధాలకు వెచ్చిస్తున్న డబ్బును అభివృద్ధి…
