Telangana government | భూముల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Telangana land registration: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ, అటవీ, దేవాదాయ భూముల అక్రమ క్రయ విక్రయాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22(ఏ) కింద రూపొందించిన “నిషేధిత భూముల జాబితాను” ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు జాబితాలను సిద్ధం చేశారు. ఆ జాబితాలో మొదట తప్పుడు వివరాలు ఉండటంతో సవరణలు చేసిన తర్వాత, “తుది జాబితాను పబ్లిక్…
